బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,10,583/10g-0.65%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి

nagendraశనివారం, 17 అక్టోబర్ 2026 · 3:47 AM4 వీక్షణలుtrinetnews.com
ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16:

తెలంగాణలో భారీగా ఓట్లను తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్ల ఫారాలు అందలేదని.. 2.64 కోట్ల మంది ఓటర్ల ఫారాలు స్వీకరించామని తెలిపారు. ఫారాలు అందిన ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చినట్లు చెప్పారు. ఫారాలు అందని వారి పేర్లు ముసాయిదా జాబితాలో లేవన్నారు.

బీఎల్‌వో (BLO)లు ఇంటింటికీ వెళ్లి ఫారాలను సేకరించారని సీఈవో తెలిపారు. ఓటర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫారాల సమర్పణకు అవకాశమిచ్చామన్నారు. ఫారాలు అందని వారి కోసం క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ చేపట్టామన్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఓటర్లు, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. 73.39 లక్షల మందికి అవకాశం ఇవ్వకుండా తొలగించారన్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →