బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,10,583/10g-0.65%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

- తెలంగాణ జౌళి రంగానికి అంతర్జాతీయ సాంకేతిక సహకారం.. యూకే సంస్థలతో రెండు కీలక ఒప్పందాలు – మంత్రి తుమ్మల - యూకేలోని హడర్స్‌ ఫీల్డ్ విశ్వవిద్యాలయం, టెక్స్‌ టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు

nagendraగురువారం, 15 అక్టోబర్ 2026 · 2:20 AM4 వీక్షణలుtrinetnews.com
- తెలంగాణ జౌళి రంగానికి అంతర్జాతీయ సాంకేతిక సహకారం.. యూకే సంస్థలతో రెండు కీలక ఒప్పందాలు – మంత్రి తుమ్మల - యూకేలోని హడర్స్‌ ఫీల్డ్ విశ్వవిద్యాలయం, టెక్స్‌ టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు

- ప్రపంచస్థాయి సాంకేతికతతో తెలంగాణ జౌళి రంగానికి కొత్త దిశ – మంత్రి తుమ్మల

  1. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14 :

తెలంగాణ రాష్ట్రంలో చేనేత, జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ, టెక్నికల్ టెక్స్‌ టైల్స్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ప్రముఖ విద్యా, పరిశ్రమ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం రెండుకీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణను అందించడం, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

హడర్స్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో తొలి అవగాహన ఒప్పందం...

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హడర్స్‌ఫీల్డ్, తెలంగాణ ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ మధ్య కుదిరిన తొలి అవగాహన ఒప్పందం ద్వారా రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించనున్నారు. ఉమ్మడి విద్యా కార్యక్రమాల నిర్వహణకు అవకాశాలను అన్వేషించడం, విజిటింగ్ అకడమిక్ సిబ్బంది నియామకం, అధ్యాపకులు, విద్యార్థుల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడం వంటివి ఈ ఒప్పందం యొక్క ముఖ్యోద్ధేశం అని మంత్రి పేర్కొన్నారు.

అలాగే, టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పురోగతికి అవసరమైన సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఈ భాగస్వామ్యం దోహదపడనుందని అన్నారు.

టెక్స్‌టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో రెండో ఒప్పందం...

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన టెక్స్‌టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (TCoE)తో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని చేనేత, జౌళి, హస్తకళల విభాగం రెండో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2026 అక్టోబర్ 14న కుదిరిన ఈ ఒప్పందం ద్వారా టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో వృత్తి విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నారని మంత్రి తెలిపారు.

ప్రత్యేకంగా 3D వీవింగ్, కాంపోజిట్ మెటీరియల్స్ వంటి ఆధునిక సాంకేతిక వస్త్రాల తయారీ, పరిశోధన, శిక్షణపై దృష్టి సారించనున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించడం, అంతర్జాతీయ నైపుణ్య ప్రమాణాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దడం ఈ

ఒప్పందం ప్రధాన ఉద్దేశం అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాభివృద్ధి...

టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగంలో ప్రపంచస్థాయి నైపుణ్య ప్రమాణాలను తెలంగాణలో అమలు చేసే అవకాశాలను పరిశీలించడంతో పాటు, పరిశ్రమలు, శిక్షణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించనున్నారు. తద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన నిపుణులను తయారు చేయడం, భారతదేశానికి అంతర్జాతీయంగా పోటీతత్వం కలిగిన టెక్స్‌టైల్ కార్మిక శక్తిని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.

తెలంగాణలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయ విద్యా సంస్థలు, పరిశ్రమలతో భాగస్వామ్యాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యాలను సమర్థంగా వినియోగించుకుని రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సమావేశంలో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జౌళిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్, యార్క్ షైర్ మేయర్ యొక్క బిజినెస్ అడ్వైసర్ Mandy Ridyard, Antich & Sons (Huddersfield) Ltd ఎండి David Antich, టెక్నికల్ టెక్స్ టైల్స్ ప్రొఫెసర్ గోస్వామి, టెక్స్ టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎండి అజీజ్ మరియు జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →