హైదరాబాద్ అక్టోబర్13 (ట్రైనెట్ న్యూస్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగం గా ఈ నెల 15వ తేదీన ఉచిత వై ద్య శిబిరం, రక్తదాన శిబిరం ని ర్వహించనున్నారు. నలువాల కవిత పృథ్వీరాజ్, మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్స్ సేవా భారతి నేతృత్వంలో ఈనెల 15వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంబర్ పేట శివంరోడ్డులోని ఏటిఐ క్యాంపస్ లో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మంగళవారం వారు ఒక ప్రకటనలో తెలిపారు. నగ రంలోని నీరు పేదలకు నాణ్యమైన వైద్య సేవల ను అందుబాటులోకి తీసుకురావడమే శిబిరం లక్ష్యమన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్య సేవలకు దూరమవు తున్న నిరుపేదలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపా రు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్ వివిధ వైద్య పరీక్షలు, నిపుణుల సలహా లు, అవసర మైన చికిత్స, మం దుల పంపిణీ వంటి సేవలను ఉచితంగా అందించనున్నట్లు వివరించారు. ఈ మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి కేంద్రమం త్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు పలువురు బిజెపి నాయకులు హాజరవనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకుని ఉ చిత వైద్య సేవలు పొందాలని, అలాగే ఈ కార్యక్ర మంలో భారతీయ జనతా పార్టీ నాయకు లు, కార్యకర్తలు, స్వచ్చంద కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
తెలంగాణ వార్తలు
రేపు ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం.. - ప్రజలు సద్వినియం చేసుకోవాలి : కవిత పృథ్వీరాజ్, అడపా చంద్రమౌళి

ఇవి కూడా చదవండి
సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర
మిగతా చదవండి →సింగిల్ విండో డైరెక్టర్ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన
మిగతా చదవండి →‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో
మిగతా చదవండి →శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ
మిగతా చదవండి →