బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,881+2.25%
NIFTY25,800+2.27%
22K₹1,12,510/10g+1.04%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

చినిగిపోని.. తడిసినా చెడిపోని మీ సేవ సర్టిఫికెట్లు 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్

nagendraబుధవారం, 14 అక్టోబర్ 2026 · 1:58 AM5 వీక్షణలుtrinetnews.com
చినిగిపోని.. తడిసినా చెడిపోని మీ సేవ సర్టిఫికెట్లు 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్

ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునేలా ప్రత్యేక తయారీ

మీసేవలో జారీ చేసే సర్టిఫికెట్లకు ఇక లామినేషన్ పని లేదు

ప్రజాభవన్‌లో ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు*----

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 13: ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు రాజ్ ఠాకూర్, విజయ రమణారరావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) కమిషనర్ టి. రవికిరణ్, అధికారులు, ప్రింటింగ్ ఏజెన్సీలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

15 అత్యాధునిక భద్రతా ఫీచర్లు*

కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌లో 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, అనధికార నకళ్లను అరికట్టేలా వీటిని రూపొందించారు. భద్రతా కారణాలతో ఈ ఫీచర్ల పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పేపర్ సులభంగా చినిగిపోదు. నీళ్లు పడినా త్వరగా దెబ్బతినదు. సాధారణ వినియోగం, మడతపెట్టడం, ఎక్కువ కాలం భద్రపరచడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో సర్టిఫికెట్లను ఏళ్ల తరబడి మంచి స్థితిలో దాచుకునే అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వాటికి లామినేషన్ చేయించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

జీవితాంతం అవసరమయ్యే పత్రాలకు మరింత రక్షణ*

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు ఉపయోగించే సర్టిఫికెట్లు ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. కొన్ని పత్రాలను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి ధ్రువపత్రాలు త్వరగా పాడవకుండా చూడటంతో పాటు వాటి విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. కొత్త సెక్యూరిటీ పేపర్‌తో సర్టిఫికెట్ల మన్నిక పెరగడంతో పాటు నకిలీలను అరికట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వ ధ్రువపత్రాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

2011 నుంచి మీ సేవ సెక్యూరిటీ పేపర్*

తెలంగాణలో మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 2011 నుంచి మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు దీర్ఘకాలం భద్రపరచాల్సిన ఇతర ప్రభుత్వ పత్రాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →