బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,09,722/10g-1.43%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

‘డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ ఇంటి ముంగిటకే ‘మీ సేవా’ సేవలు

nagendraగురువారం, 24 సెప్టెంబర్ 2026 · 4:54 AM6 వీక్షణలుtrinetnews.com
‘డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ ఇంటి ముంగిటకే ‘మీ సేవా’ సేవలు

తొలి దశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో అమలు

‘మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:

“గుడ్ గవర్నెన్స్” కు టెక్నాలజీని జోడించి ‘డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పౌర సేవల్ని నేరుగా ఇంటి ముంగిటకే చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అడ్మినిస్ట్రేషన్ కు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, యంత్రాంగమే నేరుగా ప్రజల దగ్గరికే వెళ్లేలా ఈ ‘డోర్ డెలివరీ సర్వీసెస్’కు శ్రీకారం చుట్టామన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే... జనన/మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర మీ సేవా సేవలను ఇంటి దగ్గరే అందిస్తామన్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. తొలిదశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. పౌరులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని... ఇంటి నుంచే పౌర సేవల్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐటీఈఅండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, మీ సేవా కమిషనర్ రవి కిరణ్, టీజీటీఎస్ ఎండీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం రాపెల్లి శ్రీధర్ సేవలను అభినందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ వేములవాడ, ట్రైనెట్ న్యూస్,

మిగతా చదవండి →

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →