దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
* 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
* ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
* భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం
* కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు సురేష్, సాగర్
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 : దేవుని తోటలో మంగళవారం శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మొత్తం 201 జంటలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నలుబోల రాకేష్, నలుబోల సింధు దంపతులు, వారి తల్లిదండ్రులతో పాటు దేవాదాయ శాఖ సభ్యులు సురేష్, సాగర్ ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని దేవాదాయ శాఖ సభ్యులు సురేష్, సాగర్ కోరారు.





