గురువారం26 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX84,124+1.33%
NIFTY25,872+1.40%
22K₹1,15,198/10g+3.10%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి • తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి • ఫిల్టరేషన్ ప్లాంట్లు, పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలి • ఓసీపీ-3 ఎస్ అండ్ డి విభాగం హెచ్‌ఓడీకి టీబీజీకేఎస్ వినతిపత్రం రామగుండం

ట్రైనెట్ న్యూస్ డెస్క్గురువారం, 26 నవంబర్ 2026 · 4:18 AM1 వీక్షణలుtrinetnews.com
సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

• తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

• ఫిల్టరేషన్ ప్లాంట్లు, పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలి

• ఓసీపీ-3 ఎస్ అండ్ డి విభాగం హెచ్‌ఓడీకి టీబీజీకేఎస్ వినతిపత్రం

రామగుండం, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 26: సింగరేణి కార్మికులకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నాయకులు డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు, ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ పిలుపు మేరకు ఓసీపీ-3 ఎస్ అండ్ డి సెక్షన్‌లో పిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ సభ్యుడు బొడ్డు రమేష్ ఆధ్వర్యంలో గురువారం సంబంధిత హెచ్‌ఓడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామగుండం-1, 2, 3 డివిజన్ల పరిధిలో 12 వేల మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వారికి స్వచ్ఛమైన తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గోదావరి నదిలో నీటి కొరత, ఇన్‌టేక్ గ్యాలరీల సమస్యలు, పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ నీటితో జలాలు కలుషితం కావడం, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్వహణలో లోపాలు, పైపులైన్ లీకేజీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల కొరత వంటి సమస్యలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. నీటి సరఫరా సమయాలు తగ్గడంతో షిఫ్టుల్లో విధులు నిర్వహించే కార్మికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి గోదావరి నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఇన్‌టేక్ గ్యాలరీలకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఫిల్టరేషన్ ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, పైపులైన్ లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొప్పుల శ్రీనాథ్, ప్రవీణ్, రాజేష్, వెంకటేష్, రమేష్, ఈర్ల రాజశేఖర్, మామిడి వెంకటేష్, నాగరాజు, పర్వతాలు, అల్లాడి శ్రీనివాస్, ఆనంద్, శ్రీనివాస్, కనకయ్య, రాయ నర్సు, గోపితో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతి చెందారు. అస్సాంలోని కాచర్ జిల్లా హరినగర్ సరిహద్దు ప్రాంతంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో

మిగతా చదవండి →

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →