సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి
టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపు
వీకేపీ మైన్‌లో సంఘంలో చేరిన 50 మంది కార్మికులు
గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న బుధవారం గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వీకేపీ మైన్‌లో ఆర్జీ–2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 50 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. నూతనంగా చేరిన వారికి సంఘం నాయకులు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కార్మిక గర్జన బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రాజిరెడ్డి మాట్లాడుతూ, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో కార్మికుల హక్కుల సాధనకు నిరంతరం పోరాడి అనేక విజయాలు సాధించిందని తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. తమ సంఘం కృషితో కారుణ్య నియామకాల ద్వారా 14 వేల మందికి, ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,800 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. జాతీయ కార్మిక సంఘాల హయాంలో పెండింగ్‌లో ఉన్న మరో 3,250 మందికి ఒకే దఫాలో ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర టీబీజీకేఎస్‌కు ఉందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తింపు–ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికలకు ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చి, ఎన్నికల అనంతరం వాటిని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. హామీల అమలులో జాప్యాన్ని కార్మికులు ప్రశ్నించాలని, హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడమే కార్మిక గర్జన సభ ప్రధాన లక్ష్యమని వివరించారు. అక్టోబర్ 14న జరిగే సభకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు ఐ. సత్యం, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, బేతి చంద్రయ్య, పిట్ కార్యదర్శి వెంకటేష్‌తోపాటు వెంకటేశం, మనోజ్, సాగర్, నరేష్, సతీష్, సుమంత్, రాజు, సాయిరాం, రవీందర్, సురేందర్, అజయ్, రావుల కిరణ్, వంశీకృష్ణ, కుమారస్వామి, వినోద్, మురళి, నరేందర్, మణికంఠ, పాటి వివేక్, సాయితేజ, అమిత్, శ్రీనివాస్, మధుకర్, సాయి, మల్లేష్, రోహిత్, రిషిత్, వంశీ, అనిల్, తిరుపతి, రఘు, తేజ, పృథ్వి, మహేష్, రవికుమార్, రవి నాయక్, బానేష్, శివ, పవన్, వేణు, విజయ్ కుమార్, బండి శ్రీనివాస్, పప్పులేటి లక్ష్మణ్, గుండేటి రాకేష్, మూడెం రాజు, తిప్పరవేణి రఘు, చొప్పదండి నరేష్, అల్లూరి అఖిల్, ఎస్. విజయ్ కుమార్, ఎండీ రహాన్ తదితర నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.






