గురువారం26 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX84,329+1.57%
NIFTY25,885+1.45%
22K₹1,13,811/10g+1.89%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి: అక్టోబర్ 14న ముఖ్య అతిథిగా కేటీఆర్

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి అక్టోబర్ 14న సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులకు నాయకుల పిలుపు గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12: ఈ నెల 14న బుధవారం గోదావరిఖనిలో నిర్వహ

Sai Rapoluసోమవారం, 12 అక్టోబర్ 2026 · 6:52 AM27 వీక్షణలుtrinetnews.com
సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి: అక్టోబర్ 14న ముఖ్య అతిథిగా కేటీఆర్

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి

అక్టోబర్ 14న సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్

ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులకు నాయకుల పిలుపు

గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12: ఈ నెల 14న బుధవారం గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. సభను పురస్కరించుకొని సోమవారం ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులను కలిసిన నాయకులు సభ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి కార్మికుడు హాజరై సభ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ సభను సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలపై చర్చించే వేదికగా చూడాలని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, కార్మికుల హక్కులు, పెండింగ్ సమస్యల పరిష్కారం, సంస్థ భవిష్యత్తు ప్రతి సింగరేణి కుటుంబానికి సంబంధించిన అంశాలని తెలిపారు. పార్టీలు, యూనియన్లకు అతీతంగా కార్మిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ సభలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి సంస్థ బలంగా ఉంటేనే కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, కార్మికులు ఐక్యంగా నిలిస్తేనే హక్కుల సాధనకు మరింత బలం చేకూరుతుందని నాయకులు అన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు చంద్రయ్య, బొడ్డు రమేష్, నరేష్, ప్రాజెక్టు కార్యదర్శి మామిడి తిరుపతి, బ్రాంచి కార్యదర్శులు అనిల్ రెడ్డి, హరిప్రసాద్, మార్క్ నరేష్, పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గెల్లు సదయ్యతోపాటు ప్రభాకర్ రెడ్డి, యోగేష్, నన్నువల రాకేష్, అశోక్, మామిడి వెంకటేష్, కర్నే రవి, ప్రకాష్, ప్రేమ్, సాయిచంద్, మల్లేష్, సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతి చెందారు. అస్సాంలోని కాచర్ జిల్లా హరినగర్ సరిహద్దు ప్రాంతంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో

మిగతా చదవండి →

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →