Monday12 October 2026హైదరాబాద్

SENSEX71,891-1.61%
NIFTY22,356-1.84%
HYD 22K₹1,38,144/10g+1.54%
भाषाएँ

Telangana

सिंगरेनी श्रमिक गर्जना सभा को सफल बनाएं: 14 अक्टूबर को मुख्य अतिथि के रूप में केटीआर

सिंगरेनी श्रमिक गर्जना सभा को सफल बनाएं, 14 अक्टूबर को सभा के मुख्य अतिथि के रूप में केटीआर, ओसीपी-3 एसएंडडी सेक्शन में श्रमिकों से नेताओं की अपील। गोदावरीखानी, ट्राइनेट न्यूज, 12 अक्टूबर।

Staff Reporter12 October 2026, 6:52 AM11 व्यूtrinetnews.com
सिंगरेनी श्रमिक गर्जना सभा को सफल बनाएं: 14 अक्टूबर को मुख्य अतिथि के रूप में केटीआर

Share this story

Share link keeps your language (?lang=)

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయండి

అక్టోబర్ 14న సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్

ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులకు నాయకుల పిలుపు

గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 12: ఈ నెల 14న బుధవారం గోదావరిఖనిలో నిర్వహించనున్న ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సభకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. సభను పురస్కరించుకొని సోమవారం ఓసీపీ–3 ఎస్‌అండ్‌డీ సెక్షన్‌లో కార్మికులను కలిసిన నాయకులు సభ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి కార్మికుడు హాజరై సభ విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ సభను సింగరేణి భవిష్యత్తు, కార్మికుల ప్రయోజనాలపై చర్చించే వేదికగా చూడాలని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత, కార్మికుల హక్కులు, పెండింగ్ సమస్యల పరిష్కారం, సంస్థ భవిష్యత్తు ప్రతి సింగరేణి కుటుంబానికి సంబంధించిన అంశాలని తెలిపారు. పార్టీలు, యూనియన్లకు అతీతంగా కార్మిక ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ సభలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి సంస్థ బలంగా ఉంటేనే కార్మికుల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, కార్మికులు ఐక్యంగా నిలిస్తేనే హక్కుల సాధనకు మరింత బలం చేకూరుతుందని నాయకులు అన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు చంద్రయ్య, బొడ్డు రమేష్, నరేష్, ప్రాజెక్టు కార్యదర్శి మామిడి తిరుపతి, బ్రాంచి కార్యదర్శులు అనిల్ రెడ్డి, హరిప్రసాద్, మార్క్ నరేష్, పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గెల్లు సదయ్యతోపాటు ప్రభాకర్ రెడ్డి, యోగేష్, నన్నువల రాకేష్, అశోక్, మామిడి వెంకటేష్, కర్నే రవి, ప్రకాష్, ప్రేమ్, సాయిచంద్, మల్లేష్, సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

यह भी पढ़ें

గుడిసె లేని తెలంగాణ నిర్మాణమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

గుడిసె లేని తెలంగాణ నిర్మాణమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి నల్లగొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

और पढ़ें →

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి

• గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి • జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి • స్థానిక ఎన్నికల్లో జన సైనికులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి • గిరిజన గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది • ప్రజా అవసరాలను విస్మరించి.. పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది • రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయించాము • ⁠రహదారులు, ఉపాధి, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నాం • అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం -ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

और पढ़ें →