శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,362-0.03%
NIFTY22,451-0.46%
22K₹1,39,927/10g+1.47%
భాషలు

తెలంగాణ

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు

Staff Reporter9 October 2026, 4:45 AM31 చూసులుtrinetnews.com
అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవులపల్లి శైలజ జ్యోతి కుమార్‌ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజూ అభిషేకం, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 11న బాల త్రిపురసుందరీదేవి, 12న గాయత్రీదేవి, 13న అన్నపూర్ణాదేవి, 14న మహాచండీదేవి, 15న లలితా త్రిపురసుందరీదేవి, 16న సరస్వతీదేవి, 17న మహాలక్ష్మీదేవి, 18న దుర్గాదేవి, 19న మహిషాసురమర్దినీదేవి అలంకరణల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్‌ 20న విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరీదేవి విశేష అలంకరణ నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా సామూహిక కుంకుమార్చన, చండీ హోమం, చిన్నారులతో చిన్న చిట్టి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 18న ఉదయం 9 గంటల నుంచి విశేష పూజలు, మధ్యాహ్నం 12.30 గంటలకు మహానైవేద్యం ఏర్పాటు చేయనున్నారు. భక్తులు కుటుంబసమేతంగా హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు 9393356997 నంబరులో సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి