శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తెలంగాణ వార్తలు

రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ సంబరాలు

రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ ఆడిపాడిన తెలంగాణ రెడ్డి సమితి మహిళలు పూలను, ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ: ఏనుగు నరసింహారెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17: రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక

Staff Reporter17 October 2026, 2:49 PM3 చూసులుtrinetnews.com
రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ సంబరాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్రభారతిలో ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ

ఆడిపాడిన తెలంగాణ రెడ్డి సమితి మహిళలు

పూలను, ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ: ఏనుగు నరసింహారెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17: రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా శనివారం ఎనిమిదో రోజు ‘వెన్నముద్దల బతుకమ్మ’ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రెడ్డి సమితికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. తంగేడు, గునుగు తదితర రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పూలను, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఎనిమిదో రోజు వెన్నముద్దలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయంలో విశిష్టమైనదని తెలిపారు. తెలంగాణ మహిళల ఐక్యతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న తొమ్మిది రోజుల సంబరాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. వేడుకల్లో మహిళలు, చిన్నారులు, వివిధ రంగాల కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి