రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
హైద్రాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,9.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు.తార్నాక లోని రైల్వే డిగ్రీ కళాశాలలో 1985 బ్యాచ్ తెలుగు మీడియం విద్యార్థులు శుక్రవారం పాట్నీ తాజ్ మహల్ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులుగా ఉన్న సమయంలోని కళాశాల తరగతి గదులలో గడిపిన తమ తమ మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.అందరూ కలసి ఒక్క చోట భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకున్నారు.కార్యక్రమంలో భాగంగా తోటి విద్యార్థిని ఫణీశ్వరి జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.సమ్మేళనానికి జగదీష్,శంకర్, రవీందర్ రెడ్డి ,సుబ్రమణ్యం,వెంకటస్వామి, నర్సింగ్ రావు, శేషగిరిరావు, పద్మ,పుష్పలత లు హాజరయ్యారు.





