శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తెలంగాణ వార్తలు

రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు

రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు వేడుకల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఏడో అంతస్తులో ఉన్న ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్

Staff Reporter16 October 2026, 11:46 AM65 చూసులుtrinetnews.com
రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు

వేడుకల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఏడో అంతస్తులో ఉన్న ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ కార్యాలయంలో దసరా పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కలిసి పూజల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ జాయింట్ సెక్రటరీ ఎం.రవికుమార్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు టి. ధర్మారావు, ఎం. చంద్రమోహన్, జూనియర్ ఇంజనీర్లు వెనిలా, శ్రీవిద్య, అనిల్‌రెడ్డి, శీలం మధుకర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పూజా కార్యక్రమం, అనంతరం నిర్వహించిన సమావేశ ఏర్పాట్లలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ టి. ధర్మారావు ముందుండి సమన్వయం చేశారు. అధికారులు, సిబ్బంది సమష్టిగా పాల్గొనడంతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

అందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఐక్యత, సామరస్యం, స్నేహభావాన్ని చాటుతూ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

ఇవి కూడా చదవండి