సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17: చిలకలగూడ మైలార్‌గడ్డలో ఇమ్మడి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భోలక్‌పూర్‌కు చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ అలియాస్ నిజాం (36) ను చిలకలగూడ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 6 నుంచి 6.30 గంటల మధ్య శ్రీనివాస్ తన యాక్టివాపై సమీపంలోని వైన్ షాప్ కు వెళ్లాడు. రాత్రి 7.10 నుంచి 7.20 గంటల సమయంలో మైలార్‌గడ్డ రోడ్డుపై నిజాముద్దీన్ కత్తితో శ్రీనివాస్ పై దాడి చేసి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను తొలుత ఆర్టిసి ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సుమన్ తో నిందితుడికి పరిచయం ఉండటంతో పాటు వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాల కారణంగా సుమన్ అప్పులు చేసి 2023 నవంబర్ లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన డబ్బు చెల్లించాలని నిజాముద్దీన్ డిమాండ్ చేయడంతో పాటు, ఆర్థిక వివాదంపై సివిల్ కేసు కూడా దాఖలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ పై దాడి జరిగినట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన పదునైన వంకర కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ ఎస్ హెచ్ ఓ వి. రామకృష్ణ, ఎస్ఐ జె. రాకేష్, వారి బృందాలు ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో, అదనపు డీసీపీ జె. నర్సయ్య నాయకత్వంలో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, తెలిపారు. ఆర్థిక, వ్యక్తిగత వివాదాలను చట్టబద్ధమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ వార్తలు
మైలార్‌గడ్డ హత్య కేసు ఛేదించిన పోలీసులు..
Chilakalguda police arrested a 36-year-old man in connection with the murder of Immadi Srinivas over financial disputes in Mylargadda.

ఇవి కూడా చదవండి
భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ
మిగతా చదవండి →ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన
మిగతా చదవండి →వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం రాపెల్లి శ్రీధర్ సేవలను అభినందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ వేములవాడ, ట్రైనెట్ న్యూస్,
మిగతా చదవండి →సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర
మిగతా చదవండి →