గురువారం22 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,249-1.43%
NIFTY22,688-1.35%
22K₹1,32,434/10g-2.20%
భాషలు

తెలంగాణ వార్తలు

సిరిసిల్లలో పద్మశాలి మీడియా మిత్రులకు ఘన సన్మానం

పద్మశాలి మీడియా మిత్రులకు ఘన సన్మానం రాజకీయాలకతీతంగా ఐక్యతే లక్ష్యం సిరిసిల్ల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 22: పద్మశాలి సమాజ అభ్యున్నతికి, ఐక్యతకు మీడియా మిత్రుల సేవలు ఎంతో విలువైనవని పట్టణ పద్మశాలి సంఘం ప్ర

Staff Reporter22 October 2026, 1:12 PM7 చూసులుtrinetnews.com
సిరిసిల్లలో పద్మశాలి మీడియా మిత్రులకు ఘన సన్మానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

పద్మశాలి మీడియా మిత్రులకు ఘన సన్మానం

రాజకీయాలకతీతంగా ఐక్యతే లక్ష్యం

సిరిసిల్ల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 22: పద్మశాలి సమాజ అభ్యున్నతికి, ఐక్యతకు మీడియా మిత్రుల సేవలు ఎంతో విలువైనవని పట్టణ పద్మశాలి సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్లలోని సంఘం కార్యాలయంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పత్రికా, మీడియా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాజకీయాలకతీతంగా పద్మశాలీలందరినీ ఒకతాటిపైకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. పద్మశాలీలకు రాజ్యాధికారం సాధించే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిజం రంగంలో తమదైన ముద్ర వేస్తూ, సమాజ గొంతుకగా నిలుస్తున్న మీడియా మిత్రులను గౌరవించుకోవడం గర్వకారణమన్నారు. కలం ద్వారా సమాజానికి సేవ చేస్తూ, కథనాల ద్వారా ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పద్మశాలి ఐక్యతే తమ బలమని, మీడియా మిత్రులను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. సమాజ అభ్యున్నతే లక్ష్యంగా అందరూ కలిసి ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గుంటుక పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి మాదాస్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జిందం రవీందర్, కోశాధికారి దాసరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు గాజుల సదానందం, కుందేన సాయి శరత్, తాటిపాముల సత్యనారాయణ, దూడం సురేష్, మహేశుని అనిల్‌తో పాటు గజ్జెల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి