బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

సమస్యల పరిష్కారం కోరుతూ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల ముట్టడి

సమస్యల పరిష్కారం కోరుతూ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల ముట్టడి విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌కు వినతిపత్రం హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్‌, నవంబ

Sai Rapoluమంగళవారం, 17 నవంబర్ 2026 · 9:46 AM12 వీక్షణలుtrinetnews.com
సమస్యల పరిష్కారం కోరుతూ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల ముట్టడి

సమస్యల పరిష్కారం కోరుతూ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల ముట్టడి

విద్యాశాఖలో విలీనం చేసి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌కు వినతిపత్రం

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్‌, నవంబర్‌ 17: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (ఎంఎస్‌–జేఏసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్ల నుంచి వెయ్యిమందికి పైగా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

మోడల్‌ స్కూళ్లను రాష్ట్ర విద్యాశాఖలో విలీనం చేసి, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయులు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. జీవో 317 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడంతోపాటు పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) సౌకర్యాన్ని వర్తింపజేయాలని కోరారు. టీజీటీలకు నోషనల్‌ సర్వీసు కల్పించాలని, హిందీ పీజీటీ పోస్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఆయా కుటుంబాలకు అందాల్సిన డెత్‌ గ్రాట్యుటీని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని, సీపీఎస్‌ చందాలకు అనుగుణంగా ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటును జమ చేయాలని కోరారు. హెచ్‌బీటీ వేతనాలను పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంఎస్‌–జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను గుర్తించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడుతుందనే నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →