బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి చేయూత

### పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి చేయూత ### ఎంబీబీఎస్ విద్యార్థిని రజినికి మూడేళ్ల ఫీజు చెల్లిస్తామని భరోసా ### ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ యాదాద్రి భువనగిరి, ట్రైనెట్ న్యూస్

Sai Rapoluబుధవారం, 18 నవంబర్ 2026 · 10:34 AM18 వీక్షణలుtrinetnews.com
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి చేయూత

### పేద విద్యార్థుల ఉన్నత చదువులకు మంత్రి కోమటిరెడ్డి చేయూత

### ఎంబీబీఎస్ విద్యార్థిని రజినికి మూడేళ్ల ఫీజు చెల్లిస్తామని భరోసా

### ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ

యాదాద్రి భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు కొనసాగించలేని నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన ఏ. రజిని ప్రస్తుతం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు కొనసాగించడం కష్టంగా మారిన నేపథ్యంలో రజిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి తన సమస్యను వివరించింది.

విద్యార్థిని పరిస్థితిని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులు ఆగిపోకూడదని పేర్కొన్నారు. రజిని ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు అవసరమైన మిగిలిన మూడేళ్ల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

గత దశాబ్ద కాలంగా అనేకమంది నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారం అందిస్తున్నారని, వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని ఆయన సేవలను అభినందిస్తున్నవారు పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →