బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : ఇందిరమ్మ ఇళ్ళ పేరిట పక్కా ఇళ్ళ పధకాలను అమలు జరుపుతున్న దశలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం హౌజింగ్ స్కీం పనులను చేపట్టి నిరుపేదలకు ఇ

Sai Rapoluసోమవారం, 23 నవంబర్ 2026 · 10:27 AM14 వీక్షణలుtrinetnews.com
లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : ఇందిరమ్మ ఇళ్ళ పేరిట పక్కా ఇళ్ళ పధకాలను అమలు జరుపుతున్న దశలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం హౌజింగ్ స్కీం పనులను చేపట్టి నిరుపేదలకు ఇళ్ళను అందించేందుకు ఏర్పాట్లు జరపాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం లాలాపేట లోని సాయి నగర్ లో రెండు పడకల ఇళ్ళ నిర్మాణాల కేటాయింపును పద్మారావు గౌడ్ సమీక్షించారు. రూ. తొమ్మిది కోట్ల ఖర్చుతో వివిధ వర్గాలను ఒప్పించి 10 4 ఇళ్ళను మూడు అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సాయినగర్ లో నిర్మించామని, ఇళ్ళ నిర్మాణం, కేటాయింపులో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాసిల్దార్ అస్మతుల్లా ఖాన్, డీ ఈ లు లలిత, హేము నాయక్, మహేందర్ రెడ్డి, అధికారులు, బీ.ఆర్.ఎస్. యువ నేత , రామేశ్వర్ గౌడ్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనుల్లో నాణ్యతను పాటించడంతో పాటు వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్టు వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించాలని ఆదేశించారు. జాప్యం నివారించాలని, లేని పక్షంలో సంబంధిత వ్యక్తుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల మేరకు పేదలను లబ్దిదారులుగా ఎంపిక చేసి ఇళ్ళను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులతో ముచ్చటించి వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. వారికి తగిన న్యాయం చేకురుస్తామని పేర్కొన్నారు. అదే విధంగా స్థానిక ప్రజలు, లబ్దిదారులు, అధికారుల సమక్షంలో అర్హుల పేర్లను ఎంపిక చేశారు. 104 మంది అర్హులైన లబ్దిదారులను ఈ సందర్భంగా ఎంపిక చేశారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించాలని అధికారాలను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →