బుధవారం21 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,534+1.03%
NIFTY22,722+0.44%
22K₹1,34,619/10g-0.96%
భాషలు

తెలంగాణ వార్తలు

రికార్డు సమయంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి

రికార్డు సమయంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి ఉప్పల్ బాగాయత్ సమీపంలో కారు ఢీకొని ధ్వంసమైన ఎయిర్ వాల్వ్ రక్షణ కంచెను సైతం ఢీకొనడంతో భారీగా నీటి లీకేజీ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికా

Staff Reporter21 October 2026, 4:18 AM4 చూసులుtrinetnews.com
రికార్డు సమయంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రికార్డు సమయంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి

ఉప్పల్ బాగాయత్ సమీపంలో కారు ఢీకొని ధ్వంసమైన ఎయిర్ వాల్వ్

రక్షణ కంచెను సైతం ఢీకొనడంతో భారీగా నీటి లీకేజీ

ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు.. ఐదు గంటల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తి

ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల సమన్వయంతో తాగునీటి సరఫరా పునరుద్ధరణ

పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సత్వర చర్యలు

అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్‌-2కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ ప్రమాదవశాత్తు ధ్వంసం కావడంతో ఏర్పడిన భారీ నీటి లీకేజీని జలమండలి అధికారులు అత్యంత వేగంగా అరికట్టారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి కేవలం ఐదు గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

మంగళవారం

ఉదయం 4 గంటల సమయంలో ఉప్పల్ బాగాయత్ సమీపంలోని నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రధాన రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో కృష్ణా ఫేజ్‌-2 పైప్‌లైన్‌కు సంబంధించిన ఎయిర్ వాల్వ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రక్షణ కంచెతో పాటు ఎయిర్ వాల్వ్ కూడా పూర్తిగా దెబ్బతినడంతో భారీగా నీటి లీకేజీ ఏర్పడింది.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన జలమండలి ట్రాన్స్‌మిషన్ అధికారులు సంబంధిత పంపులను నిలిపివేసి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్న జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్‌ను మరమ్మతు చేయడంతోపాటు అవసరమైన పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

ఐదు గంటల్లోనే పునరుద్ధరణ:

ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సాంకేతిక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. అవసరమైన యంత్ర సామగ్రి, సాంకేతిక సిబ్బందిని సమీకరించి నిరంతరాయంగా మరమ్మతు పనులు కొనసాగించారు. దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్ వ్యవస్థను కేవలం ఐదు గంటల్లోనే పునరుద్ధరించి, లీకేజీని పూర్తిగా అరికట్టారు. అనంతరం పైప్‌లైన్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి సంబంధిత ప్రాంతాలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు:

పండుగ సందర్భంగా నగరవాసులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పటికీ, అధికారులు, సిబ్బంది పండుగను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా శ్రమించి మరమ్మతులను సకాలంలో పూర్తి చేశారు. తద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగారు.

అధికారులు, సిబ్బందికి ఎండీ అభినందనలు:

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, అత్యంత సమన్వయంతో రికార్డు సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసిన ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

పండుగ సమయంలోనూ ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ, అంకితభావంతో విధులు నిర్వర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ఇదే విధమైన అప్రమత్తత, సమన్వయం, వేగవంతమైన స్పందనతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించడమే జలమండలి ప్రథమ ప్రాధాన్యమని, సరఫరా వ్యవస్థలో అనుకోని సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం చక్రధారుడి దివ్యస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: శ్రీవేంకటేశ్వరస్వామివ

మిగతా చదవండి →

అడుగంటుతున్న భూగర్భజలాలు.. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు

(స్టోరీ) అడుగంటుతున్న భూగర్భజలాలు రాష్ట్రంలో ఆందోళనకరపరిస్థితులు గతేడాదితో పోలిస్తే సగటున 5 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టాలు పెరుగుతున్న నీటి వినియోగం.. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో భూగర్భ జలాల

మిగతా చదవండి →

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: భారత్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత

మిగతా చదవండి →

దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మ

మిగతా చదవండి →