మంగళవారం29 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX72,529-3.07%
NIFTY22,716-3.12%
22K₹1,38,386/10g-2.28%
భాషలు

తెలంగాణ

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

💥జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర

Staff Reporter15 August 2026, 6:30 AM20 చూసులుtrinetnews.com
కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

💥జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిఏటా సంప్రదాయంగా నిర్వహిస్తున్న వేడుకలు ఈసారి కూడా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కొత్తమాసు కృష్ణమూర్తి జాతీయ జెండాను సగర్వంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాలియా ఎస్‌ఐ శ్రీ సాయి ప్రశాంత్, ఆర్యవైశ్య మండలి నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్‌ఐ సాయి ప్రశాంత్, పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ దేశ భవిష్యత్తు, సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. శ్రీ కొత్తమాసు శ్రీనివాస్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంతో పాటు దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. దేశభక్తి, ఐక్యత, యువత బాధ్యతను చాటిచెప్పిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి. జై హింద్! 🇮🇳

ఇవి కూడా చదవండి

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవకూడదు: శశిమోహన కాంతి కిరణం

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవకూడదు: శశిమోహన కాంతి కిరణం

ట్రైనేట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం .. ఎంత ఎత్తుకు ఎదిగినా క్రిందికి చూడటం. మర్చిపోకూడదు... మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతి విషయంలోనూ విజయం, పొందాలనుకునేది ఉన్నత స్థానం. దానికి నిరంతర శ్రమ, లక్ష్యం వదలని పట్ట

మిగతా చదవండి →

ఘనంగా 'దారి ఎటు?' లఘుచిత్ర ప్రదర్శన

ఘనంగా 'దారి ఎటు?' లఘుచిత్ర ప్రదర్శన

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 29: హైద్రాబాద్ లోని శ్రీ శ్రీ చిత్రశాల, ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శిరం సంజీవ్ నాయుడు నిర్మించిన "దారి ఎటు?" లఘుచిత్ర ప్రదర్శన వైభవంగా జరిగింది. ప్రముఖ స

మిగతా చదవండి →

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ సంపుటి లయన్స్ శతకం ఆవిష్కరణ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 28: ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం లయన్స్ శతకం సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభ లోని క

మిగతా చదవండి →