ఘనంగా జేఎంఎఫ్‌ఏ 30 ఏళ్ల వేడుకలు
హైదరాబాద్, అక్టోబర్ 4 (ట్రినెట్ న్యూస్):
జేఎంఎఫ్‌ఏ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జన్మదిన వేడుకలు జరుపుకొంటున్న పండు గారికి నిర్వాహకులు, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎంఎఫ్‌ఏ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





