బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా అమలు

ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు జగిత్యాల జిల్లాలో 2,83,458 కుటుంబాల నమోదు లక్ష్యం 481 శిబిరాలు.. 121 మంది పర్యవేక్షకుల నియామకం జగిత్యాల, ట్రైనెట్ న్యూస్,

Sai Rapoluమంగళవారం, 17 నవంబర్ 2026 · 11:10 AM23 వీక్షణలుtrinetnews.com
ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా: నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా అమలు

ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

జగిత్యాల జిల్లాలో 2,83,458 కుటుంబాల నమోదు లక్ష్యం

481 శిబిరాలు.. 121 మంది పర్యవేక్షకుల నియామకం

జగిత్యాల, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఈ పథకాన్ని జిల్లాలో సమర్థంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కుటుంబంలో సంపాదించే సభ్యునికి జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని నమోదు చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

నమోదుకు ఆధార్ ప్రతితో హాజరుకావాలి

జిల్లాలో 2,83,458 కుటుంబాలను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 481 శిబిర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నమోదు సమయంలో బీమాదారుని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పథకం ఉద్దేశం, అర్హతలు, నమోదు విధానం, అవసరమైన పత్రాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటింటికీ పథకం వివరాల ప్రచారం

శిబిరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రతి నాలుగు కేంద్రాలకు ఒక పర్యవేక్షకుడి చొప్పున జిల్లాలో 121 మందిని నియమించినట్లు తెలిపారు. నవంబర్ 17, 18 తేదీల్లో అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో డప్పు చాటింపు నిర్వహించడంతో పాటు ఇంటింటికీ పథకం వివరాలను తెలియజేయాలని సూచించారు. డేటా అందుబాటులో లేదనే కారణంతో ఏ ఒక్కరినీ శిబిరం నుంచి వెనక్కి పంపించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →