Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,521-1.19%
NIFTY22,184-1.65%
HYD 22K₹1,37,867/10g-0.19%
भाषाएँ

Telangana

मंत्री पोंगुलेटी ने इंदिराम्मा हाउसिंग टावर्स की आधारशिला रखी

In a major step towards fulfilling the housing dreams of urban poor, Minister Ponguleti Srinivas Reddy laid the foundation stone for Indiramma housing towers near Malkam Cheruvu in Rayadurgam, Hyderabad.

Staff Reporter21 September 2026, 12:23 PM7 व्यूtrinetnews.com
मंत्री पोंगुलेटी ने इंदिराम्मा हाउसिंग टावर्स की आधारशिला रखी

Share this story

Share link keeps your language (?lang=)

పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు*

*ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన*

*రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మాణ పనులకు శ్రీకారం*

*పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం*

*పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక*

*వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే బోనాలు ఎత్తించేలా పనులు పూర్తి చేస్తాం*

*ఖరీదైన ప్రాంతాల్లోనే పేదలకు సొంత ఇళ్లు.. ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు*

*మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి*

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 21 : మహానగరంలోని క్యూర్ పరిధిలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి

మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గరలోనే సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. పేదలను నగరానికి దూరంగా తరలించడం కాకుండా, ఖరీదైన ప్రాంతాల్లోనే గౌరవంగా నివసించేలా ఇందిరమ్మ టవర్స్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. పేదవాడి సొంతింటి కలను కేవలం నాలుగు గోడలు, పైకప్పుతో పూర్తి చేయడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని, పేదవాడికి ఆత్మగౌరవంతో జీవించే చిరునామా ఇవ్వడమే లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో భూముల విలువ భారీగా ఉన్న ప్రాంతాల్లోనే పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఎకరం వందల కోట్ల విలువ చేసే ప్రాంతంలో పేద కుటుంబాలకు ఇల్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారికి భద్రత, భరోసా కల్పిస్తోందన్నారు. ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల వరకు అన్‌డివైడెడ్ షేర్‌తో పాటు అపార్ట్‌మెంట్‌పై పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, సేల్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, ఎవరి సిఫార్సులు, ఒత్తిళ్లకు లొంగకుండా అర్హత ఆధారంగా ఎంపిక జరుగుతోందన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు కూడా ‘క్యూర్’ ప్రాంతంలో లాటరీ ఎంపికలను పబ్లిక్‌గా ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో తొలి విడతగా 480 ఇళ్ల చొప్పున నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే పలుచోట్ల టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలల్లో తొలి దశలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని, రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. “ఇక్కడ దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి పేద కుటుంబం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. రెండో విడత, మూడో విడత, నాలుగో విడత, ఐదో విడతగా కూడా ఇళ్లు నిర్మిస్తాం. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ‘క్యూర్’ ప్రాంతంలో అర్హులైన పేదలకు దశలవారీగా ఇళ్లు అందిస్తాం” అని మంత్రి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే లబ్ధిదారులతో బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలను వేగవంతం చేస్తామని అన్నారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, లబ్దిదారులు తమ ఇల్లు ఎలా కడుతున్నారో మీ కళ్ల ముందే మీరు చూసుకోవచ్చు. వారానికి ఒకసారి వచ్చి నిర్మాణ పనులను పరిశీలించండి. నాణ్యతలో లోపం కనిపిస్తే అక్కడే ఉన్న అధికారులకు ఫిర్యాదు చేయండి. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు..” ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక గిఫ్ట్ కాదు.. మీ పిల్లలకు, మీ భవిష్యత్ తరాలకు మిగిలే ఆస్తి. రాయదుర్గం వంటి ప్రాంతంలో ‘నాకూ ఒక సొంత అపార్ట్‌మెంట్ ఉంది’ అని మీ పిల్లలు గర్వంగా చెప్పుకునేలా ఈ ఇంటిని కాపాడుకోండి” అని మంత్రి కోరారు. గతంలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి నగరానికి 30–40 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన విధానాలకు భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డునే పేదలకు ఇళ్లు నిర్మిస్తోందని మంత్రి అన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం సరికాదని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదల ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీలు, అమలు చేసిన పనులపై ప్రజలే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →