బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

Sai Rapoluమంగళవారం, 24 నవంబర్ 2026 · 9:40 AM13 వీక్షణలుtrinetnews.com
బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

* ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ

* చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు

* జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 : మహిళను ఇంటి వద్ద దింపుతానని నమ్మించి బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మల్కాజిగిరి సఫిల్‌గూడకు చెందిన టి. యాదమ్మ (51) ఈ నెల 21న మెట్టుగూడ సమీపంలోని కల్లు దుకాణానికి వెళ్లింది. అక్కడ సాయి అనే వ్యక్తి పరిచయమై ఆమెను ఇంటి వద్ద దింపుతానని నమ్మించి తన ఆక్టివా వాహనంపై తీసుకెళ్లాడు. అనంతరం అలుగడ్డబావి మహంకాళి దేవాలయం సమీపంలో ఇద్దరూ మద్యం సేవించారు. ఈ క్రమంలో యాదమ్మ మత్తులో నిద్రపోగా, కొంతసేపటి తర్వాత మేల్కొని చూడగా మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. సదరు వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితురాలు ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలగూడ కింది బస్తీకి చెందిన పాల వ్యాపారి పి. సాయికుమార్ (40)ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ కె. రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీ జె. నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి మార్గదర్శకత్వంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదాబాబు పర్యవేక్షణలో క్రైమ్ సిబ్బంది నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రజల ఆస్తుల పరిరక్షణకు, నేరాల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్

లాలాపేట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను తనిఖీ చేసిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : ఇందిరమ్మ ఇళ్ళ పేరిట పక్కా ఇళ్ళ పధకాలను అమలు జరుపుతున్న దశలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సైతం హౌజింగ్ స్కీం పనులను చేపట్టి నిరుపేదలకు ఇ

మిగతా చదవండి →