హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్: విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి అన్నారు. ఆర్ ఎస్ లోటస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు చేయడం అభినందనీయమన్నారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో తమ అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రామ్మోహన్ రాధారి, వెంకట్రమణి, బ్రహ్మ, సత్య, అజిత్, ప్రసాద్, విజయ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






