శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,456/10g-0.12%
భాషలు

తెలంగాణ వార్తలు

డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి

డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి జన్మదిన వేడుకల్లో ‘ఏ ట్రిబ్యూట్‌ టు గురు’ పుస్తకం హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్‌ 16: ప్రముఖ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ దీనదయాళ్‌ జన్మది

Staff Reporter16 October 2026, 10:20 AM11 చూసులుtrinetnews.com
డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి

జన్మదిన వేడుకల్లో ‘ఏ ట్రిబ్యూట్‌ టు గురు’ పుస్తకం

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్‌ 16: ప్రముఖ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ దీనదయాళ్‌ జన్మదిన వేడుకలు షెనాయ్‌ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అశోక్‌ పిళ్లై, శిష్యులు కలిసి తమ గురువు పట్ల కృతజ్ఞతను చాటుతూ ‘ఏ ట్రిబ్యూట్‌ టు గురు — ఏ జర్నీ ఆఫ్‌ గ్రాటిట్యూడ్‌, గైడెన్స్‌ అండ్‌ హయ్యర్‌ అలైన్‌మెంట్‌’ పేరుతో పుస్తకాన్ని రూపొందించారు. గురువుగా ఆయన అందించిన మార్గదర్శకత్వానికి, తమ వృత్తి ప్రయాణంలో కల్పించిన స్ఫూర్తికి అక్షర రూపంలో గౌరవం సమర్పించారు.

మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్‌ దీనదయాళ్‌ ఈఎన్‌టీ వైద్యరంగంలో విశిష్ట గుర్తింపు పొందారు. దేశంలో ఈఎన్‌టీ శస్త్రచికిత్సల్లో రేడియో ఫ్రీక్వెన్సీ సాంకేతికతను ప్రవేశపెట్టిన మార్గదర్శకుడిగా నిలిచారు. దక్షిణ భారతదేశంలో లాలాజల గ్రంథుల నాళాలకు సంబంధించిన సమస్యల నిర్ధారణ, చికిత్సకు ఉపయోగించే సయాలెండోస్కోపీ విధానాన్ని పరిచయం చేయడంలోనూ ముందున్నారు. వైద్యరంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా 2010లో ‘భారతీయ చికిత్సక్‌ రత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. ఈఎన్‌టీ వైద్యానికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను రచించి, తన అనుభవాన్ని భావితరాల వైద్యులకు అందించారు. వైద్యుడిగా, రచయితగా, గురువుగా ఆయన చేసిన కృషిని ప్రతిబింబిస్తూ శిష్యులు రూపొందించిన ఈ పుస్తకం జన్మదిన వేడుకలకు ప్రత్యేకతను చేకూర్చింది.

ఇవి కూడా చదవండి