దేవరకొండ బస్తీలో ట్రాన్స్ఫార్మర్ తరలింపు
దానం నాగేందర్ ఆదేశాలతో తొలగిన రాకపోకల అడ్డంకి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని దేవరకొండ బస్తీలో రాకపోకలకు అడ్డంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పక్కనున్న ఖాళీ స్థలానికి తరలించారు. దానం నాగేందర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ముజ్జు పర్యవేక్షణలో విద్యుత్ సిబ్బంది ఈ పనులు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ తరలింపుతో రహదారిపై అదనపు స్థలం అందుబాటులోకి వచ్చింది. వాహనదారులు, పాదచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది. ఇదే సందర్భంగా సయ్యద్ ముజ్జు పర్యవేక్షణలో స్థానిక నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుధ్య పనులు నిర్వహించారు.






