సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX80,893+5.17%
NIFTY24,998+4.98%
22K₹1,32,473/10g+0.83%
భాషలు

తెలంగాణ వార్తలు

కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు

కొండారెడ్డిపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్ల

Staff Reporter21 October 2026, 4:13 AM3 చూసులుtrinetnews.com
కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కొండారెడ్డిపల్లి లో సీఎం రేవంత్ రెడ్డి దసరా వేడుకలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో పెద్ద ఎత్తున గ్రామస్తులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. గజమాలతో సీఎంను గ్రామస్తులు సత్కరించారు. అనంతరం సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. సాయంత్రం వేళ మైసమ్మ ఆలయంలో పూజలతో పాటు సంప్రదాయ జమ్మి చెట్టు పూజా కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులను నేరుగా కలిసి మాట్లాడారు. కాగా మొదటి నుంచీ దసరా వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామంలో జరుపుకోవడం రేవంత్ రెడ్డికి ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి రాకతో కొండరెడ్డిపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

అంతర్జాతీయ ‘మిస్ అండ్ మిస్టర్ ప్లానెట్’ పోటీలకు ఇండియా, అమెరికా నేషనల్ డైరెక్టర్‌గా బిగ్‌బాస్ విజేత కౌశల్ మండ! భారతదేశం తరఫున ఈషాన్ యెల్డే, అశ్రిత నీలకంఠం.. అమెరికా తరఫున తన్వి పడాల ఎంపిక

మిగతా చదవండి →

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

తెలంగాణ సంస్కృతి వైవిధ్యం ముందు తరాలకు అందించాలి సాహితీ అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 7: తెలంగాణ సంస్కృతిలో వైవిధ్యం ఉందని బతుకమ్మ బోనాలు వంటి ప్రత్యేకత లు ఉన్నాయని వాటిని ముందు తరాలకు అందించాలనీ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ చెప్పారు శ్రీ త

మిగతా చదవండి →