Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,521-1.19%
NIFTY22,184-1.65%
HYD 22K₹1,37,867/10g-0.19%
भाषाएँ

Telangana

तेलंगाना की संस्कृति के प्रतीक होंगे हवाई अड्डे और तेलंगाना भवन: सीएम रेवंत रेड्डी

तेलंगाना की संस्कृति के प्रतीक होंगे निर्माण कार्य व्यापक योजना के साथ हवाई अड्डे के काम किए जाने चाहिए... विभागों के बीच समन्वय से ही कार्यों में तेजी आएगी मुख्यमंत्री ए. रेवंत रेड्डी, हैदराबाद, ट्रिनेट न्यूज, 22 सितंबर।

Staff Reporter22 September 2026, 3:15 PM5 व्यूtrinetnews.com
तेलंगाना की संस्कृति के प्रतीक होंगे हवाई अड्डे और तेलंगाना भवन: सीएम रेवंत रेड्डी

Share this story

Share link keeps your language (?lang=)

తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా నిర్మాణాలు

* స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌తో విమానాశ్ర‌యాల ప‌నులు చేప‌ట్టాలి...

* శాఖ‌ల మ‌ధ్య స‌మన్వ‌యంతోనే ప‌నులు వేగ‌వంతం

* ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతికి ప్ర‌తిరూపాలుగా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యం శిల్ప‌, వాస్తు క‌ళ‌ను ప‌రిశీలించి, అవి ప్ర‌తిబింబించేలా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఆదిలాబాద్‌, వరంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌పై రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్ర‌వాహం మార్పు, ర‌హ‌దారుల మ‌ళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగు నీటి స‌ర‌ఫ‌రా లైన్ల మార్పు అంశాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. ఆయా అంశాల‌పై పూర్తి వివ‌రాలు తెలుసుకున్న ముఖ్య‌మంత్రి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. విమానాశ్ర‌యాల కాంపౌండ్ వాల్ స‌మీపం నుంచి ర‌హ‌దారులు నిర్మించాల‌ని, ఆ ర‌హ‌దారుల‌ను స‌మీప జిల్లా, రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానం చేయాల‌ని సూచించారు. ఏ శాఖ‌కు ఆ శాఖ విడివిడిగా ప‌నులు చేప‌డితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌న్నారు. విద్యుత్‌, ఆర్ అండ్ బీ, తాగు నీటి స‌ర‌ఫ‌రా, నీటి పారుద‌ల శాఖ అధికారులు స‌మావేశ‌మై బీఎస్ఎన్ఎల్ అధికారుల‌తో చ‌ర్చించి, ఏక‌కాలంలో ప‌నులు సాగేలా చూడాల‌ని సూచించారు. ప్రస్తుత అవ‌స‌రాల‌నే కాకుండా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించుకొని ప‌నులు ముందుకు సాగేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాగులు, ఇత‌ర నీటి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించాల్సి వ‌స్తే, విమానాశ్ర‌యాల ప్రాంగణం లేదా స‌మీపంలో చెరువుల‌ను నిర్మించి, అక్క‌డి నుంచి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విమానాశ్ర‌యాల‌కు వ‌చ్చే, వెళ్లే ర‌హ‌దారులు విశాలంగా ఉండ‌డంతో పాటు స‌మీపంలోని ముఖ్య ర‌హ‌దారుల‌కు అనుసంధానించేలా నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. నిర్దేశిత స‌మ‌యంలో ప‌నులు పూర్త‌య్యేందుకు పూర్తి

ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాల‌తో పాటు ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ప్ర‌తి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప‌, వాస్తు క‌ళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ఆదేశించారు. ప‌లు ఆకృతుల్లో మార్పుల‌ను సీఎం సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల అయిల‌య్య‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌, విద్యుత్ శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్‌, ప్ర‌ణాళిక శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి గంగాధ‌ర్‌, ప‌వ‌ర్ గ్రిడ్ ఈడీ డొమ‌న్ యాద‌వ్‌, టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వ‌రుణ్ రెడ్డి, ఎయిర్ క‌మోడొర్ రాహుల్ శుక్లా, ఏవియేష‌న్ డైరెక్ట‌ర్ భ‌ర‌త్ రెడ్డి, స్థ‌ప‌తి ఈమ‌ని శివ‌నాగిరెడ్డి

త‌దిత‌రులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →