బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

విద్యారంగానికి చుక్కా రామయ్య శత వసంతాలు స్ఫూర్తిదాయకం

విద్యారంగానికి చుక్కా రామయ్య శత వసంతాలు స్ఫూర్తిదాయకం ఆయన సేవలు తెలంగాణ సమాజానికి గర్వకారణం: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 20: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్య వందవ జన్మదినోత్

Sai Rapoluశుక్రవారం, 20 నవంబర్ 2026 · 10:32 AM11 వీక్షణలుtrinetnews.com
విద్యారంగానికి చుక్కా రామయ్య శత వసంతాలు స్ఫూర్తిదాయకం

విద్యారంగానికి చుక్కా రామయ్య శత వసంతాలు స్ఫూర్తిదాయకం

ఆయన సేవలు తెలంగాణ సమాజానికి గర్వకారణం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 20: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్య వందవ జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యారంగానికి గొప్ప పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఆయనదని కొనియాడారు. విద్యావేత్తగా, సామాజిక పరివర్తనకు కృషి చేసిన వ్యక్తిగా చుక్కా రామయ్య సమాజంపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

ఐఐటీ అనే పదాన్ని రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త చుక్కా రామయ్య అని సీఎం గుర్తుచేశారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. శాసనమండలి సభ్యుడిగా కూడా ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేశారని తెలిపారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్‌లతో కలిసి శాసనమండలిలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని రేవంత్‌రెడ్డి చెప్పారు. సామాజిక, ప్రజా సమస్యలపై పదునైన ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా, వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారని ప్రశంసించారు. రాజకీయ నాయకులు ఉకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సమస్యలను ప్రస్తావించడంతోపాటు పరిష్కార మార్గాలను చూపించే నాయకులు కొద్దిమందే ఉంటారని, ఆ కోవకు చెందిన వ్యక్తి చుక్కా రామయ్య అని పేర్కొన్నారు. పార్టీ బలంతో సంబంధం లేకుండా చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారికి చట్టసభల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించేవారని తెలిపారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాలలు లేని విషయాన్ని అప్పట్లో చుక్కా రామయ్య, ఇతర సభ్యులు శాసనమండలిలో ప్రస్తావించారని గుర్తుచేశారు. వారి చొరవతోనే ఆ సమస్య ప్రభుత్వ దృష్టికి వచ్చి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పీవీ నరసింహారావు, జైపాల్‌రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి గొప్ప వ్యక్తులు తెలంగాణలో జన్మించడం రాష్ట్ర ప్రజల గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. కాలానికి, రాజకీయాలకు అతీతంగా నిలిచే వ్యక్తులు వీరని, ప్రజల పట్ల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగానే రాజకీయ నాయకులందరిలోనూ వారి పట్ల గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. చుక్కా రామయ్య మరింత ఆరోగ్యంగా ఉండి అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఆయన ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మరోసారి వందవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రరావు, ప్రొఫెసర్ హరగోపాల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →