ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,352/10g+0.02%
హైదరాబాద్ 24K₹1,57,475/10g+0.02%
వెండి₹2,21,719/kg+3.67%

తెలంగాణ

‘చాయ్ విత్ సైనా’ వేదికగా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై విస్తృత అవగాహన

తెలుగు ప్రెస్ రిలీజ్ ‘చాయ్ విత్ సైనా’ ద్వారా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై అవగాహనకు ప్రముఖులు, వైద్యులు, మార్పు తీసుకువచ్చే నాయకుల సమిష్టి మద్దతు హైదరాబాద్, సెప్టెంబర్ 20, 2026: సుహార్థ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Chai wi

Staff Reporter21 September 2026, 1:05 PM56 చూసులుtrinetnews.com
‘చాయ్ విత్ సైనా’ వేదికగా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై విస్తృత అవగాహన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తెలుగు ప్రెస్ రిలీజ్

‘చాయ్ విత్ సైనా’ ద్వారా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై అవగాహనకు ప్రముఖులు, వైద్యులు, మార్పు తీసుకువచ్చే నాయకుల సమిష్టి మద్దతు

హైదరాబాద్, సెప్టెంబర్ 20, 2026:

సుహార్థ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Chai with Saina – A Cup of Tea. A Conversation. A Cause.” కార్యక్రమం హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, వైద్యులు, CSR నిపుణులు, పారిశ్రామికవేత్తలు, దాతలు, సామాజిక సేవా రంగ ప్రముఖులు, చేంజ్‌మేకర్లు హాజరై సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్, మహిళల ఆరోగ్యం, గౌరవం మరియు అవగాహనపై తమ మద్దతును తెలిపారు.

సుహార్థ్ ఫౌండేషన్ యొక్క Mission 2030 — 1 మిలియన్ నిరుపేద బాలికలు మరియు మహిళలకు సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్ ద్వారా సాధికారత కల్పించడం, అలాగే దేశవ్యాప్తంగా Period Povertyను నిర్మూలించే దిశగా పనిచేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ సందర్భంగా Former World No. 1 Badminton Champion సైనా నెహ్వాల్ సుహార్థ్ ఫౌండేషన్‌కు Social Ambassadorగా తన అనుబంధాన్ని కొనసాగించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైనా నెహ్వాల్‌తో కలిసి దేశవ్యాప్తంగా బాలికలు మరియు మహిళల్లో రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రత, గౌరవం, అవగాహన మరియు అందుబాటుపై మరింత విస్తృతమైన చర్చలను తీసుకెళ్లాలని సుహార్థ్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న సుహార్థ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు హితేషి దత్తా, మెన్స్ట్రువల్ హైజీన్ మరియు Period Povertyపై చేస్తున్న కృషికి “Padwoman of India”గా గుర్తింపు పొందారు.

కార్యక్రమానికి జయేష్ రంజన్ గారు, నవాబ్ రౌనక్ యార్ ఖాన్ సాహెబ్, డా. జయంతి రెడ్డి గారు, డా. మంజుల అనగాని గారు, డా. శిల్పి రెడ్డి గారు, డా. విమీ బింద్రా గారు, ఎరయా ఫెర్టిలిటీకి చెందిన డా. ఐశ్వర్య గారు, డా. పృథ్వీ పెరుమ్ గారు, డా. శాలిని నారాయణ్ గారు, డా. నితిన్ చావ్లా గారు, గీతా భాస్కర్ గారు, శైలజ కోట గారు, సుమన్ TVకి చెందిన డా. నీలిమా ఆర్య గారు, సుధా జైన్ మరియు Bigg Boss 8 ఫేమ్ సోనియా యష్, తదితర CSR నాయకులు, వైద్యులు, సామాజిక సేవా రంగ ప్రముఖులు మరియు చేంజ్‌మేకర్లు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అవగాహనతో పాటు అందుబాటుపై దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలకు ఆర్గానిక్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్యాడ్స్‌తో పాటు సుహార్థ్ రూపొందించిన Sustainable Menstrual Hygiene Awareness Booklets అందించారు. ఈ బుక్‌లెట్ల ద్వారా రుతుక్రమం, పరిశుభ్రత, పర్యావరణహితం, వ్యక్తిగత గౌరవం మరియు POCSO అవగాహన వంటి అంశాలపై బాలికలకు వయసుకు అనుగుణమైన అవగాహన కల్పించబడింది.

అలాగే ప్రముఖ వైద్య నిపుణులతో మహిళల ఆరోగ్యం, మెన్స్ట్రువల్ హెల్త్, ఎండోమెట్రియోసిస్, ఫెర్టిలిటీ, మెనోపాజ్, మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్ మరియు బాలికలకు చిన్న వయసు నుంచే సరైన అవగాహన అవసరం వంటి కీలక అంశాలపై చర్చలు నిర్వహించారు.

“Chai with Saina”ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, దేశవ్యాప్తంగా Sustainable Menstrual Hygieneపై అవగాహన మరియు అందుబాటును పెంచే ఒక విస్తృతమైన సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సుహార్థ్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

Mission 1 Million by 2030.

1 మిలియన్ బాలికలు & మహిళలకు సాధికారత — సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్ ద్వారా.

“One Cup. One Conversation. One Cause.”

ఇవి కూడా చదవండి

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

స్వర్ణగిరిలో ఆకట్టుకున్న ‘నృత్య పుష్పాంజలి’

ఆకట్టుకున్న నృత్య పుష్పాంజలి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంప్రదాయ నృత్యాల వైభవం భావితరాలకు నృత్య కళలను అందించడమే లక్ష్యం: నాగేంద్ర యాదవ్ ట్రైనెట్ న్యూస్: స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తి,

మిగతా చదవండి →

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం అప్లికేషన్ ప్రక్రియ ,పథకం అమలుపై చర్చ   బీసీ గురుకులాలు, హాస్టల్ ల పనితీరుపై చర్చ

Transport and BC Welfare Minister Ponnam Prabhakar held a high-level review meeting on the application process for the 'Intinta Indiramma Sewing Machines' scheme and the functioning of BC residential schools and hostels.

మిగతా చదవండి →

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు* *ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన* *రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మాణ పనులకు శ్రీకారం* *పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం* *పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారు

మిగతా చదవండి →