బల్కంపేట్, హైదరాబాద్ - ట్రైనెట్ న్యూస్ 20 : నందికంటి భాస్కర్, రామస్వామి రాజు ఆధ్వర్యంలో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు, ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూపు అధినేత శివ నరసింహాన్ తంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారికి అర్చన చేసి ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు అందరితో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నందికంటి రవి, నందికంటి భాస్కర్, రామస్వామి రాజు, సతీష్ యాదవ్, ట్రైనెట్ న్యూస్ చైర్మన్ రాపోలు వెంకటేశ్వర్లు, శివరాత్రి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.






