బుధవారం21 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,736+1.31%
NIFTY22,796+0.77%
22K₹1,34,327/10g-1.19%
భాషలు

తెలంగాణ వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మ

Staff Reporter21 October 2026, 4:14 AM3 చూసులుtrinetnews.com
దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి అంతరాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆశీర్వచన మండపంలో గవర్నర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. మరో వైపు నవరాత్రులు చివరి రోజు కావడంతో దుర్గమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి వేడుకలు మంగళవారం ముగిసాయి.

ఇవి కూడా చదవండి

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం చక్రధారుడి దివ్యస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: శ్రీవేంకటేశ్వరస్వామివ

మిగతా చదవండి →

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అధ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్ - ఖమ్మం - నల్గొండ స్థానం నుంచి అభ్యర్థిగా ఖరారు దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఎన్నికల కో ఆర్డినేటర్, అబ్జర

మిగతా చదవండి →

అడుగంటుతున్న భూగర్భజలాలు.. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు

(స్టోరీ) అడుగంటుతున్న భూగర్భజలాలు రాష్ట్రంలో ఆందోళనకరపరిస్థితులు గతేడాదితో పోలిస్తే సగటున 5 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టాలు పెరుగుతున్న నీటి వినియోగం.. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20 : రాష్ట్రంలో భూగర్భ జలాల

మిగతా చదవండి →

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారత్‌లోనూ ప్రభుత్వ మార్పు కుట్రలు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: భారత్‌లోనూ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత

మిగతా చదవండి →