బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ఎట్టకేలకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం

### ఎట్టకేలకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం ### చైర్మన్‌గా సూదగాని మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్‌గా ఎం.ఏ. ఎజాస్ ### 18 మంది డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వం గెజిట్ విడుదల యాదాద్రి భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18

Sai Rapoluబుధవారం, 18 నవంబర్ 2026 · 10:37 AM21 వీక్షణలుtrinetnews.com
ఎట్టకేలకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం

### ఎట్టకేలకు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం

### చైర్మన్‌గా సూదగాని మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్‌గా ఎం.ఏ. ఎజాస్

### 18 మంది డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వం గెజిట్ విడుదల

యాదాద్రి భువనగిరి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకాలపై నెలకొన్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. కమిటీ చైర్మన్‌గా సూదగాని మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్‌గా ఎం.ఏ. ఎజాస్‌ను నియమించింది. వీరితో పాటు మొత్తం 18 మంది డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ఉత్తర్వుల ప్రతులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు మార్కెటింగ్ శాఖ మంత్రి ఓఎస్డీ, ఏపీసీ కార్యదర్శికి పంపించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మార్కెట్ కమిటీ నియామకాలు పూర్తికావడంతో ఆలేరు నియోజకవర్గంలోని రాజకీయ, వ్యవసాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

నూతనంగా నియమితులైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలకవర్గం రైతుల ప్రయోజనాల పరిరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుందని స్థానిక రైతులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →