బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,973+2.37%
NIFTY25,791+2.23%
22K₹1,12,612/10g+1.14%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

- కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా - నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

nagendraగురువారం, 5 నవంబర్ 2026 · 4:03 AM3 వీక్షణలుtrinetnews.com
- కొడంగల్‌లో నవంబర్ 7 నుంచి 9 వరకు మెగా రైతు మేళా - నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

- 150 ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు

- మూడు రోజుల పాటు రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన.. శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సమావేశాలు

- చివరి రోజు పొరుగు జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరవుతారని అంచనా

- రైతులందరూ మెగా రైతు మేళాను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 4: రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించే లక్ష్యంతో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్‌లో మూడు రోజుల పాటు మెగా రైతు మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ మేళాను ప్రారంభించనున్నారని వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రదర్శన స్టాళ్లను సందర్శించనున్నారు.

ఈ మెగా రైతు మేళాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఆయిల్‌ఫెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్ సంస్థలు, విత్తన పరిశ్రమ, వాలంతరి (WALAMTARI), క్రిడా (CRIDA), కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహా మొత్తం 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 150 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్, నూతన తరం రసాయనాలు, నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, వివిధ శాఖల సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ కార్యక్రమాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అవార్డు గ్రహీతలైన ప్రగతిశీల రైతులతో సాంకేతిక సమావేశాలు, ముఖాముఖి చర్చలు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOs), ఇతర భాగస్వామ్య సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెట్ అవకాశాలు, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను వివరించనున్నారు.

మొదటి రోజు ముఖ్యమంత్రితో రైతు మేళా ప్రారంభోత్సవం

నవంబర్ 7వ తేదీన మొదటి రోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు పాల్గొననున్నారు. రైతులకు ముందుగానే అల్పాహారం అందించడంతో పాటు కార్యక్రమ ప్రాంగణంలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి మెగా రైతు మేళాను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం అనంతరం PJTAU, KLSHU శాస్త్రవేత్తలు, వివిధ అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రగతిశీల రైతులు, అవార్డు గ్రహీతలైన రైతులు తమ అనుభవాలు, పరిజ్ఞానం, విజయగాథలను రైతులతో పంచుకునేలా సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాల కోసం 2,500 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రత్యేక హాలును ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జరిగే చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విజయవంతమైన రైతుల అనుభవాలు, విజయగాథలను తెలియజేసే డాక్యుమెంటరీలు, వీడియోలను కూడా ప్రదర్శించనున్నారు. వైవిధ్యభరితమైన, అధిక ఆదాయం అందించే పంటల సాగును ప్రోత్సహించడం, సంప్రదాయ పంటలపై ఆధారపడటాన్ని తగ్గించడం, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో నూతన అవకాశాలను అన్వేషించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు.

రైతులకు వ్యవసాయ పరికరాలు, యంత్రాల పంపిణీ

మొదటి రోజు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల సమక్షంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, పప్పుధాన్యాల మిల్లులు, నూనె గానుగ యూనిట్లు, భూసార పరీక్ష కార్డులు, బయో రిసోర్స్ ఇన్‌పుట్ సెంటర్లు, ఉద్యానవన శాఖకు సంబంధించిన డ్రిప్ సిస్టమ్స్ తదితర వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, యూనిట్లను రైతులకు అందించనున్నారు. మొదటి రోజు కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.

రెండో రోజు మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత

రెండో రోజు కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా రైతులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళా రైతుల పాత్ర, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వారికి అవగాహన కల్పించనున్నారు.

మూడో రోజు 10 జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరవుతారని అంచనా

మూడో రోజు పొరుగు జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులను సమీకరించనున్నారు. చివరి రోజు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగంతో మెగా రైతు మేళా ముగియనుంది.

రైతులకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, సాంకేతిక సంస్థలతో నేరుగా చర్చించే అరుదైన అవకాశాన్ని ఈ మెగా రైతు మేళా కల్పిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రైతులందరూ ఈ మూడు రోజుల మెగా రైతు మేళాలో పాల్గొని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →