సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీల అమలుపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా హామీల అమలులో పురోగతి ఏమిటని నాగరాజు గౌడ్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయని విమర్శించారు. ప్రజల పన్నుల సొమ్ముతో కాంగ్రెస్ భారీ సభ నిర్వహిస్తోందని ఆరోపించారు.
సభలో ప్రసంగించి వెళ్లిపోవడమే కాకుండా, ఎన్నికల హామీల అమలు పరిస్థితిని ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందన్నారు. ప్రజలు మాటల కంటే హామీల అమలునే కోరుకుంటున్నారని నాగరాజు గౌడ్ పేర్కొన్నారు.





