బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

గజ్వేల్‌లో 3,266 మందికి కొత్త చేయూత పింఛన్లు.. 390 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తాం – రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:27 AM6 వీక్షణలుtrinetnews.com
గజ్వేల్‌లో 3,266 మందికి కొత్త చేయూత పింఛన్లు.. 390 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తాం – రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి

గజ్వేల్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:

పేదల సంక్షేమం, మహిళల ఆర్థిక సాధికారత, యువతకు ఉపాధి కల్పన, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి మంత్రి వివిధ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3,266 మంది లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను, రెండో విడతలో 390 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో మరో 2,000 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరి వారి కళ్లల్లో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, సిద్దిపేట జిల్లాలో మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.330 కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని వివరించారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్లతో మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమం, మహిళలకు ఆర్థిక బలం, యువతకు ఉపాధి, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →