సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి భానుమతి సుంకరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భగవద్గీత గ్రంథాన్ని కానుకగా అందజేశారు.
ప్రతి హిందూ ఇంట్లో భగవద్గీత ఉండాలనే సంకల్పంతో గ్రంథాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు భానుమతి తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 300 భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. గీతలోని బోధనలు, జీవన విలువలు ప్రజలకు స్ఫూర్తినిస్తూ ధర్మమార్గంలో నడిచేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఆనంద్ గౌడ్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. భగవద్గీత సందేశాన్ని ప్రజలకు చేరవేసి సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే తన లక్ష్యమని భానుమతి సుంకరి తెలిపారు.





