బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

బీజేపీ నగర కార్యాలయంలో 300 డివిజన్ల అధ్యక్షుల సమావేశం పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై నాయకుల చర్చ

Chief guests include Ramachandar Rao, MP Dr. K. Laxman, and Minister Ashish Shelar. Hyderabad, trinet NEWS, November 19...

nagendraశుక్రవారం, 20 నవంబర్ 2026 · 4:31 AM7 వీక్షణలుtrinetnews.com
బీజేపీ నగర కార్యాలయంలో 300 డివిజన్ల అధ్యక్షుల సమావేశం పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై నాయకుల చర్చ

ముఖ్య అతిథులుగా రామచందర్ రావు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, మంత్రి ఆశిష్ షెలార్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19 :

హైదరాబాద్‌లోని బీజేపీ నగర కార్యాలయంలో గురువారం జీహెచ్ఎంసీ, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన సుమారు 300 డివిజన్ల బీజేపీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు ఎన్. రామచందర్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్, కర్ణాటకలోని బెళగావి ఎమ్మెల్యే, సహ ఇన్‌చార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్యతో పాటు తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలకు సమావేశంలో ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పి. సాయి ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. వివిధ ప్రాంతాల డివిజన్ అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →