గోదావరిఖని, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:
కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నిరంతరం పోరాడుతుందని సంఘం ఆర్జీ–2 వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆర్జీ–2 పరిధిలోని ఓసీపీ–3లో వివిధ సెక్షన్లను సంఘం నాయకులతో కలిసి సందర్శించారు. కార్మికులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీబీజీకేఎస్ హయాంలో 70కి పైగా కార్మిక హక్కులతోపాటు కోల్ ఇండియాలోనూ లేని 18 ప్రత్యేక హక్కులను సాధించామని తెలిపారు. 13,800 కారుణ్య నియామకాలు, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా 3,800, ఎక్స్‌టర్నల్ నియామకాల ద్వారా 3,300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంఘం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందని, అవసరమైన పనిముట్లు, స్పేర్‌పార్ట్స్ అందుబాటులో లేక యంత్రాలు నిలిచిపోయి ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, గతంలో సాధించిన హక్కులు కోల్పోతున్న పరిస్థితిపై ఆయా సంఘాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో అబ్బు శ్రీనివాసరెడ్డి, బేతి చంద్రయ్య, బొడ్డు రమేష్, మామిడి తిరుపతి, అనిల్‌రెడ్డి, కర్కా శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, ననువాల రాకేష్, దీటి శ్రీనివాస్, రమేష్, నరేందర్, దేవేందర్‌రెడ్డి, కర్నే రవి, అమరబోని శ్రీనివాస్, ప్రవీణ్, కిరణ్, సంపత్, శ్రీనివాస్, అశోక్, సురేష్, బాలరాజు, మోర అశోక్, కనపర్తి సమ్మయ్య, కృష్ణమోహన్, కృష్ణతేజ, రాజు, శ్యామ్, మనోజ్, అరుణ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







