బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,730+1.99%
22K₹1,11,392/10g+0.03%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం కింద రూ.1,087.64 కోట్లు సాధించి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ

State Government recognition of progress in agriculture at national level Farmer registry and incentive from the Centre for effective practices in fertilizer distribution Facilitated services to farmers

nagendraగురువారం, 19 నవంబర్ 2026 · 4:39 AM10 వీక్షణలుtrinetnews.com
ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం కింద రూ.1,087.64 కోట్లు సాధించి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ

– వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతికి జాతీయ స్థాయిలో గుర్తింపు

– ఫార్మర్ రిజిస్ట్రీ, ఎరువుల పంపిణీలో సమర్థవంతమైన విధానాల అమలుకు కేంద్రం నుంచి ప్రోత్సాహకం

– రైతులకు సులభతరమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

నవంబర్ 18:* రాష్ట్ర వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం (SASCI) పథకం కింద ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహక (SCA) రూపంలో రూ.1,087.64 కోట్ల నిధులను అందుకుని దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అమలు చేసిన వినూత్న విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా సాధించిన పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ సేవలను రైతులకు మరింత చేరువ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతికి కేంద్రం నుంచి ఈ ప్రోత్సాహకం లభించిందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతుల ఫార్మర్ ఐడీలను నమోదు చేసినందుకు గాను రూ.422.64 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయ నిధులను కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 26న విడుదల చేసిందని మంత్రి వివరించారు. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్ (Fertilizer Sales System – FSS) ద్వారా ఎరువుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేసినందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోదించిన రూ.665 కోట్ల ప్రోత్సాహక నిధులు మూడు విడతల్లో పూర్తిగా విడుదలయ్యాయని తెలిపారు. మొదటి విడతలో రూ.175 కోట్లు, రెండో విడతలో రూ.165 కోట్లు, మూడో విడతలో రూ.325 కోట్లు అందాయని పేర్కొన్నారు. ఈ విధంగా రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.1,087.64 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయం లభించిందని వెల్లడించారు.

రాష్ట్రంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు మూడు దశల్లో ఎఫ్ఎస్ఎస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామని మంత్రి తెలిపారు. తొలుత రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, అనంతరం 50 శాతం జిల్లాలకు విస్తరించి, చివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేశామన్నారు. ఈ విధానం ద్వారా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని పొందిన ఐడీ ఆధారంగా తమకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉన్న డీలర్ల వద్ద సులభంగా కొనుగోలు చేసే అవకాశం కలిగిందన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే ఇబ్బందులు తగ్గడంతో పాటు, రైతులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల వివరాలు సమగ్రంగా అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు వీలవుతోందని మంత్రి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లోనూ రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా పంటల కొనుగోలు సమయంలో కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఉపయోగపడుతుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను సులభంగా విక్రయించేందుకు దోహదపడుతుందని వివరించారు.

వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన ఈ ఘనత వెనుక వ్యవసాయ శాఖ అధికారుల సమిష్టి కృషి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగారి మార్గదర్శకత్వంలో, తన నిరంతర పర్యవేక్షణలో వ్యవసాయశాఖ కార్యదర్శి, వ్యవసాయశాఖ సంచాలకులు, కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు, క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగామని తెలిపారు. ఈ సందర్భంగా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి అన్నారు. కేవలం నిధులు సాధించడమే కాకుండా, ఆ విధానాల ద్వారా రైతులకు వాస్తవ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతూ, రైతులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

రైతుల అనుభవాలు

నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు వంచర్ల అవినాష్ (తండ్రి: బాలయ్య)కు సర్వే నంబర్లు 62, 47లో మొత్తం 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పొందిన ఆయన మాట్లాడుతూ, "ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఉండటం వల్ల నేను పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో సులువుగా అమ్ముకోగలుగుతున్నాను"

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన రైతు వింజం శ్రీనివాసరావు (తండ్రి: అనంతరామయ్య) మాట్లాడుతూ, ఈ వానాకాలంలో కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా ఎరువులను అతి సులభంగా బుక్ చేసుకొని పొందినట్లు తెలిపారు.

"మూడు ఎకరాల 10 గుంటల్లో వరి సాగు చేశాను. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి కలిగి ఉండడం వల్ల, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా పంటలకు కావాల్సిన ఎరువులను అతి సులభంగా బుక్ చేసుకొని పొందగలిగాను."

— వజ్జ మహేష్, తండ్రి: వెంకట్రామయ్య

గట్టుపల్లి గ్రామం, కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఇవి కూడా చదవండి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం..

సింగిల్ విండో డైరెక్టర్‌ పవన్ నాయక్ కు ఘన సన్మానం.. - జూపల్లి, జేపల్లి గ్రామ నాయకులు, ప్రజలు ఘన సన్మానం.. ట్రైనెట్ న్యూస్, కల్వకుర్తి నవంబర్ 23 : చారకొండ మండలం జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమలిగుట్ట తాండకు చెందిన

మిగతా చదవండి →

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

మిగతా చదవండి →

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ

శ్రీ త్యాగరాయగానసభలో ‘రాధామోహనాలు’ పుస్తకావిష్కరణ సాహితీవేత్తల సమక్షంలో ఘనంగా కార్యక్రమం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి నేదునూరి అనురాధ రచించిన ‘రాధామోహనాలు’ కథ

మిగతా చదవండి →