బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,10,536/10g-0.69%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

తెలంగాణ వార్తలు

నైపుణ్యంతో కొలువుల బాట! సింగరేణి ఆర్జీ–1 నైపుణ్య శిక్షణ కేంద్రం నుంచి 112 మంది ఉద్యోగాలకు ఎంపిక

nagendraసోమవారం, 12 అక్టోబర్ 2026 · 1:52 AM5 వీక్షణలుtrinetnews.com
నైపుణ్యంతో కొలువుల బాట! సింగరేణి ఆర్జీ–1 నైపుణ్య శిక్షణ కేంద్రం నుంచి 112 మంది ఉద్యోగాలకు ఎంపిక

ఫాక్స్కాన్లో 87 మంది మహిళలకు అవకాశం

తొలి విడతలో బయలుదేరిన 55 మంది మహిళలు

  1. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:

సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. రామగుండం–1 ఏరియాలోని సింగరేణి జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా తాజాగా 154 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 127 మంది మహిళా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. వీరిలో 87 మంది హైదరాబాద్లోని ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక కాగా, మరో 27 మంది పురుష అభ్యర్థులు సోలార్ టెక్నిషియన్ ఇంటర్వ్యూలకు హాజరు కాగా.. వీరిలో 25 మంది సోలార్ టెక్నిషియన్లుగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఫాక్స్కాన్కు ఎంపికైన మహిళల్లో తొలి విడతగా 55 మంది ఆదివారం గోదావరిఖని నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. శిక్షణ నుంచి ఉపాధి వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. గత రెండేళ్లలో 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించింది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. మహిళలకు తయారీ రంగంలో అవకాశాలు ఫాక్స్కాన్ కంపెనీ ఆధ్వర్యంలో గత వారం జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హైదరాబాద్లోని కంపెనీ తయారీ కేంద్రంలో ఆపిల్ ఇయర్పాడ్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాల అసెంబ్లింగ్ విభాగాల్లో పనిచేసేందుకు 87 మంది మహిళలను ఎంపిక చేశారు. స్థానిక మహిళలకు పారిశ్రామిక రంగంలో లభించిన ఈ అవకాశాలు వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడనున్నాయి. సోలార్ టెక్నిషియన్ కోర్సులో శిక్షణ పొందిన 25 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆర్జీ–1 జీఎం డి. లలిత్ కుమార్ తెలిపారు. వీరు పది రోజుల్లో ఎల్ అండ్ ఎన్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరనున్నట్లు పేర్కొన్నారు.

నైపుణ్యాలతో భవిష్యత్తుకు పునాది సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని జీఎం డి. లలిత్ కుమార్ అన్నారు. శిక్షణను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానించడం ద్వారా యువత మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో పనిచేస్తూ వృత్తిలో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వో టు జీఎం ఎస్.కె. చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, టాస్క్ మేనేజర్ డాక్టర్ కౌసల్య, ఎల్ అండ్ ఎన్ డైరెక్టర్ కౌశల్, ఫాక్స్కాన్ హెచ్ఆర్ ప్రతినిధి శ్రీ ఆర్. శ్రీనివాస్, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజెపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం

వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడి ప్రశంసా పత్రం రాపెల్లి శ్రీధర్ సేవలను అభినందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ వేములవాడ, ట్రైనెట్ న్యూస్,

మిగతా చదవండి →

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

మిగతా చదవండి →