బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 4:55 AM10 వీక్షణలుtrinetnews.com
ఖేలో ఇండియా క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16: డిసెంబర్ 11 నుంచి 22వ

తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 జాతీయ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల్లో సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జూమ్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు, అధికారులకు తగు దిశా నిర్దేశనం చేశారు.

ఈ క్రీడా పోటీలు హైదరాబాద్ తో పాటు హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ లో సుమారు 8,000 మంది క్రీడాకారులు, ఇతర ప్రతినిధులు పాల్గొననున్న ఈ క్రీడా సంబరాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు నేడు ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా క్రీడలపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ముఖ్యమైన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బెలూన్లు తో క్రీడల మస్కట్, లోగోల పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, కాజీపేట తదితర రైల్వే స్టేషన్లు, నగరంలోని సెంట్రల్ బస్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా టార్చ్ ర్యాలీలను కూడా నిర్వహించాలని సూచించారు.

క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంతో పాటు, క్రీడాకారుల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పాఠశాలల నుంచి విద్యార్థులను క్రీడా వేదికలకు తీసుకువచ్చేందుకు తగిన రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. క్రీడాకారులకు నాణ్యమైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించాలని, విద్యార్థులు, క్రీడాకారుల భాగస్వామ్యంతో ఈ క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రముఖ క్రీడాకారులు, విశిష్ట వ్యక్తులు, ముఖ్యంగా గౌరవ మంత్రి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ తదితర క్రీడా ప్రముఖుల ద్వారా విద్యార్థులకు ప్రేరణ కల్పించేలా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సి.ఎస్. తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఖేలో ఇండియా క్రీడల విజయవంతమైన నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కీలక పాత్ర పోషించాలని, ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వ యువజన, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, క్రీడా శాఖ యం.డి సోనీ బాలా దేవి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, డైరెక్టర్ (మీడియా అండ్ కమ్యూనికేషన్స్) శ్రీరామ్ కర్రి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ కమీషనర్, ఆయా జిల్లా కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →