బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

మణికుమార్ క్రికెట్ క్లబ్ ఘన విజయం ప్రతీక్, వేదాస్ అద్భుత బౌలింగ్‌.. హర్షవర్ధన్, తరుణ్ అజేయ అర్ధశతకాలు

Manikumar Cricket Club defeated Sacred Heart Cricket Club by 8 wickets in the HCA 'C' Division One-Day League Championship match.

nagendraఆదివారం, 20 సెప్టెంబర్ 2026 · 2:17 AM6 వీక్షణలుtrinetnews.com
మణికుమార్ క్రికెట్ క్లబ్ ఘన విజయం ప్రతీక్, వేదాస్ అద్భుత బౌలింగ్‌.. హర్షవర్ధన్, తరుణ్ అజేయ అర్ధశతకాలు

మణికుమార్ క్రికెట్ క్లబ్ ఘన విజయం

ప్రతీక్, వేదాస్ అద్భుత బౌలింగ్‌.. హర్షవర్ధన్, తరుణ్ అజేయ అర్ధశతకాలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్‌డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో మణికుమార్ క్రికెట్ క్లబ్ అద్భుత ప్రదర్శనతో సేక్రెడ్ హార్ట్ క్రికెట్ క్లబ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రీన్ వ్యూ క్రికెట్ గ్రౌండ్-2లో జరిగిన ఈ మ్యాచ్‌లో మణికుమార్ సీసీ బౌలర్లు ప్రతీక్ రాజనేని, వేదాస్ వురాడి అద్భుతంగా రాణించగా, బ్యాటింగ్‌లో డి. హర్షవర్ధన్, కెప్టెన్ నగరం తరుణ్ రెడ్డి మెరిశారు.

టాస్ గెలిచిన మణికుమార్ క్రికెట్ క్లబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సేక్రెడ్ హార్ట్ సీసీ 42.5 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. మణికుమార్ సీసీ బౌలర్లలో ప్రతీక్ రాజనేని 9 ఓవర్లలో 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. వేదాస్ వురాడి 9 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మణికుమార్ సీసీ కేవలం 36.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డి. హర్షవర్ధన్ 81 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ నగరం తరుణ్ రెడ్డి 57 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 68 పరుగులు చేశాడు. ఓపెనర్ వేదాస్ వురాడి 54 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మణికుమార్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు సమష్టిగా ప్రదర్శించిన జట్టు స్ఫూర్తిని క్లబ్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రియదర్శిని ప్రాతురి, కార్యదర్శి కృష్ణ చతుర్వేదుల అభినందించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు సంయుక్త కార్యదర్శి రవి తేజ్ చతుర్వేదుల జ్ఞాపికలు, పతకాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :