గురువారం22 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,249-1.43%
NIFTY22,688-1.35%
22K₹1,32,215/10g-2.37%
భాషలు

క్రీడలు

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం... - వెల్జాల వెంకటేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్.. ట్రైనెట్ న్యూస్, నాగర్ కర్నూలు అక్టోబర్ 22 : దసరా పండుగను పురస్కరించుకుని చార

Staff Reporter22 October 2026, 1:27 PM9 చూసులుtrinetnews.com
జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం...*

- వెల్జాల వెంకటేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్..

*ట్రైనెట్ న్యూస్, నాగర్ కర్నూలు అక్టోబర్ 22 :* దసరా పండుగను పురస్కరించుకుని చారకొండ మండల పరిధిలోని జేపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు మాజీ వార్డు సభ్యులు వెల్జాల వెంకటేష్, దొడ్లపల్లి గోడేట్టి శేఖర్, జేపల్లి గ్రామ పంచాయతీ ఫార్మర్ అడ్వైజర్ కమిటీ సభ్యురాలు కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో రెండు రోజుల పా టు నిర్వహించిన క్రికెట్ టోర్న మెంట్ ఉత్సాహభరితంగా సాగింది. ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో నెమలిగుట్ట తాండ అత్యు త్తమ ప్రతిభ కనబరిచిన జట్టు విజేతగా అవతరించింది. రన్నరప్ గా దొడ్లపల్లి జట్టు నిలిచింది. విజేత జట్టుకు మొదట బహుమతికి రూ.8వెలు జేపల్లి సీనియర్ మాజీ వార్డు సభ్యులు వెల్జాల వెంకటేష్ ఆర్థిక సహాయం చేయగా, రెండవ బహు మతికి 4వేలు దొడ్లపల్లి గొడ్డేటి శేఖర్ ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా జేపల్లి గ్రామ పంచాయతీ ఫార్మర్ అడ్వై జర్ కమిటీ సభ్యురాలు కొర్రావత్ కవిత పవన్ నాయక్ విజేతల జట్టుకు ట్రోపీల కు ఆర్థికంగా చేయూత అందించారు. పోటీలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సభలో కొర్రావత్ కవిత పవన్ నాయక్, గ్రామ సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్, వెల్జాల వెంకటేష్, దొడ్లప ల్లి శేఖర్, పలువురు ముఖ్య అతిథులు గా పాల్గొని విజేతలకు, రన్నరప్ జట్లకు నగదు బహుమతి, ట్రోఫీలను ప్రదానం చేశారు. పండుగ వేళల్లో ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని పెంపొందించారు. క్రీడలు శారీ రక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి, క్రీడాకారుల మధ్య ఐక్యతకు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. గె లు పోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని యువతకు పి లుపునిచ్చారు. ఈ సందర్భంగా టోర్న మెంట్ కు ఆర్థిక సహాయం అందించి, టోర్నమెంట్ నిర్వహించిన వెల్జాల వెంక టేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ లను గ్రామ యువత, క్రీడకారులు, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేపల్లి గ్రామ పంచా యతీ యువత, క్రీడాభిమానులు, గ్రామ స్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకా రులను అభినందించారు.

ఇవి కూడా చదవండి