బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

మహిళా సైక్లింగ్‌లో సత్తా చాటుతున్న యువ క్రీడాకారిణులు దక్షిణాది రాష్ట్రాల ప్రతిభకు వేదికగా అస్మిత లీగ్‌ ఐదు రాష్ట్రాల నుంచి సుమారు 240 మంది మహిళల భాగస్వామ్యం

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 4:46 AM7 వీక్షణలుtrinetnews.com
మహిళా సైక్లింగ్‌లో సత్తా చాటుతున్న యువ క్రీడాకారిణులు దక్షిణాది రాష్ట్రాల ప్రతిభకు వేదికగా అస్మిత లీగ్‌ ఐదు రాష్ట్రాల నుంచి సుమారు 240 మంది మహిళల భాగస్వామ్యం

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:

మహిళా సైక్లిస్టుల ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ ఉమెన్స్ ట్రాక్ సైక్లింగ్ లీగ్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఐదు రాష్ట్రాలకు చెందిన సుమారు 240 మంది మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్నారు.

సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో క్రీడాకారిణులు తమ వేగం, నైపుణ్యం, పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. మహిళలు సైక్లింగ్‌లో రాణించేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. యువ క్రీడాకారిణులకు అవకాశాలు కల్పించడం, పోటీతత్వాన్ని పెంపొందించడం, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడం లీగ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

పోటీలకు తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన అధ్యక్షుడు పి. మల్లారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జి. చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి. విజయకాంతరావు, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ మాక్సివెల్ ట్రైవర్, సాట్స్ కోచ్‌లు భాస్కర్ రెడ్డి, పాండు జాదవ్, రైల్వే కోచ్ ధర్మతేజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు క్రీడాకారిణుల ప్రతిభను అభినందించారు. మహిళా క్రీడాకారులకు ఇలాంటి వేదికలు మరిన్ని అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు రమేష్, గోపాలం, పౌల్స్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :