బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

క్రీడలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్, బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

Telangana is proud to be a venue for national level sports competitions Minister Wakiti Srihari Under the leadership of Chief Minister Ravant Reddy, the aim is to make Telangana the sporting capital of the country.

nagendraగురువారం, 19 నవంబర్ 2026 · 4:47 AM11 వీక్షణలుtrinetnews.com
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్, బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్

జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణం – మంత్రి వాకిటి శ్రీహరి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశ క్రీడా రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కృషి

ఖేలో ఇండియా నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు

మధిర, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 18:

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026కు సంబంధించిన లోగో, మస్కట్, బ్రోచర్‌ను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఖమ్మం జిల్లా మధిరలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్రీడలు కేవలం పతకాల సాధనకే పరిమితం కావని, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ యువత చదువులతోపాటు క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 విజయవంతానికి క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత, ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :