బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,973+2.37%
NIFTY25,791+2.23%
22K₹1,12,612/10g+1.14%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

జాతీయ వార్తలు

స్వచ్ఛత హీ సేవా–2026కు శ్రీకారం పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ

The Union Ministry of Textiles has launched the 'Swachhata Hi Seva-2026' campaign to promote cleanliness and healthy living across the country.

nagendraమంగళవారం, 22 సెప్టెంబర్ 2026 · 11:25 AM7 వీక్షణలుtrinetnews.com
స్వచ్ఛత హీ సేవా–2026కు శ్రీకారం పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

దేశవ్యాప్తంగా పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛత హీ సేవా–2026’ కార్యక్రమాన్ని చేపట్టింది. మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని సంస్థల్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రచారం కొనసాగనుంది.

ఈ ఏడాది ‘స్వచ్ఛత మే సహభాగ్ – స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్’ అనే నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పరిశుభ్రతను సమష్టి బాధ్యతగా భావిస్తూ ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడమే దీని ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రచారంలో భాగంగా కార్యాలయ ప్రాంగణాలు, విద్యాసంస్థల క్యాంపస్‌లు, ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, పౌర బాధ్యత, పరిశుభ్రమైన అలవాట్లపై అవగాహన కల్పించేందుకు ఉద్యోగులు, విద్యార్థులు, పౌర సమాజ సంస్థలు, స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు.

కార్యక్రమాల ప్రారంభంలో భాగంగా సెప్టెంబర్ 18న న్యూఢిల్లీలోని నేతాజీ నగర్ జీపీఓఏ–3లో థీమ్ ఆధారిత ఆర్ట్ పోస్టర్ తయారీ పోటీ నిర్వహించారు. జౌళి మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల అధిపతులు కార్యాలయాల్లోని సెక్షన్లను సందర్శించి పరిశుభ్రత పరిస్థితులను సమీక్షించారు.

ఉద్యోగులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ ‘స్వచ్ఛత హీ సేవా–2026’ లక్ష్యాలను విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :