భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ కె. వేణు మృతి చెందారు. అస్సాంలోని కాచర్ జిల్లా హరినగర్ సరిహద్దు ప్రాంతంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన బరాక్ నదిలో గల్లంతయ్యారు.
రెండు రోజుల గాలింపు అనంతరం బుధవారం ఉదయం అస్సాంలోని శ్రీభూమి జిల్లా స్టీమర్ఘాట్ సమీపంలో కుషియారా నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
వివరాలు: జవాన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించనున్నట్లు, మరణానికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారణ కావాల్సి ఉంది.





